![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-8 మొదట్లోనే ఈ సారి ఎంటర్టైన్మెంట్ ఇన్ఫినిటీ అన్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అయితే ఇంకా మూడు వారాలే ఉండడంతో ఈ వారం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరగబోతుంది. ఈ టికెట్ ఒక్కరికే ఉంటుంది. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది ఉండగ.. టాప్-5 మాత్రమే ఫైనల్ లో ఉంటారు. ఈ టికెట్ టు ఫినాలే టికెట్ పొందిన వారు డైరెక్ట్ ఫినాలే వీక్ లో ఉంటారు.
అన్ని సీజన్లలో కంటే డిఫరెంట్ థీమ్ తో ఈ 'టికెట్ టు ఫినాలే' జరగాలని బిగ్ బాస్ భావిస్తున్నాడంట. ఇందుకోసం టాస్క్ లు ఆడించడానికి బయటనుండి మాజీ హౌస్ మేట్స్ వచ్చి టాస్క్ లు ఆడిస్తారంట. అందులో భాగంగనే బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్స్ అయిన అఖిల్ సార్థక్, అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హారిక ఇద్దరు మంగళవారం రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనునట్లు తెలుస్తుంది.
అయితే ఇలా ఒక్కో టాస్క్ కి ఇద్దరు మాజీ హౌస్ మేట్స్ రాబోతున్నారు. ఇలా వారంతం ఈ టాస్క్ జరుగుతుంది. ఇలా ఓల్డ్ కంటెస్టెంట్స్ కి కూడా బిగ్ బాస్ లోకి వచ్చే ఛాన్స్ కల్పిస్తున్నాడు బిగ్ బాస్. గతవారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి హౌస్ మేట్స్ ని నామినేషన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫినాలే వీక్ ఆడించడానికి బిగ్ బాస్ మామ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వారం జరిగే టికెట్ టు ఫినాలే టాస్క్ లలో గెలిచే ఫైనల్ కి వెళ్ళేదెవరో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.
![]() |
![]() |